Mohan babu : మోహన్ బాబు సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ గ్యారెంటీ..ఆ బుకింగ్స్ ఏంటి బాబోయ్

Mohan babu : టాలీవుడ్ లో డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ ఇలా రెండు టాగ్స్ కలిగిన సీనియర్ హీరో మంచు మెహన్ బాబు.. వారి కుటుంబం కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం ఉంది? ఎవరు ఎలా ఉన్నా ఏమనుకున్నా సరే మంచు రూటే సెపరేటు.. అలాగే మంచి మనోజ్ ని పక్కన పెడితే తెలుగు సినిమా “మా” ప్రెసిండెంట్ మంచు విష్ణు గాని మోహన్ బాబుల సినీ మార్కెట్ అయితే ఏ రేంజ్ లో ఉందో కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఆల్రెడీ అది విష్ణు తన లాస్ట్ సినిమా “మోసగాళ్లు” తో చూపించగా ఇప్పుడు మోహన్ బాబు వంతు వచ్చింది.. తాను చాలా కాలం తర్వాత హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. ఇది రేపు ఫిబ్రవరి 18న రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ సినిమాకి మాత్రం ఇప్పుడు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ రావడం కన్ఫర్మ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రికార్డు బ్రేకింగ్ అంటే మామూలుగా కాదు అతి తక్కువ వసూళ్లతో అట. ఆల్రెడీ హైదరాబాద్ లో ఈ సినిమా బుకింగ్స్ ఆన్ లైన్ లో ఓపెన్ చెయ్యగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపట్లేదు అట. ఇదిలా ఉంటే ఫైనల్ గా మహేష్ థియేటర్ ఏ ఎం బి సినిమాస్ లో ఏకంగా రెండు టికెట్స్ బుక్ అవ్వడం ఆసక్తిగా మారిపోయింది.

దీనితో వీరిపై మరిన్ని ట్రోల్స్ ఇప్పుడు పడుతున్నాయి. ఫైనల్ గా మంచు వారి మార్కెట్ పరిస్థితి ఇలా అయ్యిపోయింది. మొదట్లో వీరు అనుకున్నట్టు ఓటిటి కే ఈ సినిమాని ఇచ్చేసుకున్నా బాగుండేది. కొంచెం అయినా పరువు నిలబడేది.