కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని పాపులర్ కమెడియన్లలో కోవై సరళ ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగులో కోవై సరళ యాక్టింగ్ వల్ల సక్సెస్ సాధించిన సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించగలరని కోవై సరళకు పేరుంది. ప్రస్తుతం తమిళ సినిమాలతో కోవై సరళ బిజీగా ఉన్నారు. అయితే కోవై సరళ పెళ్లికి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

కోవై సరళ పెళ్లికి దూరంగా ఉండటం వెనుక విషాదకరమైన కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. లేడీ కమెడియన్లలో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకున్న కోవై సరళ శ్రీలక్ష్మి తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆమె కామెడీ కొంచెం అతిగా ఉంటుందని చాలామంది కామెంట్లు చేసినా ఎంతోమందికి ఆమె కామెడీ టైమింగ్ నచ్చింది. బ్రహ్మానందం కోవైసరళ కాంబినేషన్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కోవై సరళ వయస్సు 60 సంవత్సరాలు కాగా కుటుంబ బాధ్యతల వల్లే ఆమె పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. తన సినీ కెరీర్ లో కోవై సరళ దాదాపుగా 900 సినిమాలలో నటించారని సమాచారం అందుతోంది. కోవైసరళకు నలుగురు చెల్లెళ్లు ఉండగా వాళ్ల కోసమే కోవై సరళ వివాహానికి దూరంగా ఉన్నారని సమాచారం అందుతోంది. నటనకు ఆమె పూర్తిస్థాయిలో పరిమితమయ్యారు.

సినిమాల్లో నవ్వుతూ కనిపించే కోవై సరళ నిజ జీవితంలో అనుభవిస్తున్న కష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే కమెడియన్లలో కోవై సరళ ఒకరు. కోవై సరళ కెరీర్ లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు కోవై సరళకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. తెలుగు, తమిళ భాషల్లో కోవై సరళకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.