చిరంజీవి, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ఎందుకు ఫ్లాపైందో మీకు తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఎంతోమంది కొత్త నిర్మాతలను సీనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎన్టీఆర్ సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన వాళ్లలో కనకమేడల దేవీ వరప్రసాదరావు ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు నిర్మించిన ఈ నిర్మాత ఆ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకోవడంతో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు.

అయితే ఈ స్టార్ ప్రొడ్యూసర్ కేవలం సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిలతో మాత్రమే సినిమాలను నిర్మించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిలకు క్లోజ్ అయిన ఈ నిర్మాత ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో తిరుగులేని మనిషి అనే సినిమాను నిర్మించగా ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని అందరూ భావించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.

తిరుగులేని మనిషి సినిమాలో పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటించగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చిరంజీవి నటించారు. ఎక్కువ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేయడంతో చిరంజీవి ఈ సినిమాలో చేయడానికి అంగీకరించారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో పాటలు పాడే వ్యక్తి పాత్రలో నటించి చిరంజీవి మెప్పించారు. ఈ సినిమాలో చిరంజీవి, ఎన్టీఆర్ కలిసి ఒక సాంగ్ చేయగా ఆ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి, ఎన్టీఆర్ ఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ చిరంజీవికి స్థలాలు కొనుగోలు చేయాలని స్థలాలపై పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచనలు చేశారని సమాచారం. స్థలాలపై ఇన్వెస్ట్ చేసే డబ్బులు వృథా అయ్యే అవకాశం ఉండదని ఆయన చెప్పినట్టు సమాచారం అందుతోంది. సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా నిర్మాత దేవీ వరప్రసాద్ కు మాత్రం నష్టం రాలేదు. కథ, కథనం ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో లేకపోవడం ఈ సినిమా ఫ్లాప్ కు కారణమని తెలుస్తోంది.