చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ కాంబో మూవీ ఆగిపోవడానికి కారణమేంటో తెలుసా?

మెగా నందమూరి కాంబో హీరోల కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించగా ఇప్పటికీ ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజమౌళి వల్లే మెగా నందమూరి హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించడానికి ఓకే చెప్పారు. అయితే చాలా సంవత్సరాల క్రితమే ఈ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఒక సినిమా అయితే ఆగిపోయింది. రానా ప్రతాప్ కథతో రాజమౌళి డైరెక్షన్ లో వాస్తవానికి ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది.

అయితే ఎన్టీఆర్ దగ్గర పని చేసిన సుకుమార్ అనే వ్యక్తి పరోక్షంగా ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి కారణమయ్యారు. ఈ ఇద్దరు హీరోల మధ్య బేధాభిప్రాయాలు వచ్చేలా ఆ వ్యక్తి చేయడంతో ఈ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోవడం గమనార్హం. ఒకవేళ ఈ కాంబినేషన్ లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కి ఉంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ అయ్యి ఉండేవని చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ దిశగా ఏ స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ ప్రొడ్యూసర్ అడుగులు వేస్తారేమో చూడాలి. మెగా నందమూరి హీరోలు కలిసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదు. ఎన్టీఆర్ సైతం కథ నచ్చితే స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధమేనని వెల్లడించిన సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు ఎన్టీఆర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే ఈ అప్ డేట్లలో ఏ అప్డేట్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి.