100% లవ్ కథ నాగార్జున వల్లే మారిందా.. సుకుమార్ అనుకున్న కథేంటంటే?

నాగచైతన్య సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో 100% లవ్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో తమన్నా హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. కథ, కథనంలో లోపాలున్నా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం. ఈ సినిమాలో నాగచైతన్య బాలు పాత్రలో తమన్నా మహాలక్ష్మి పాత్రలో నటించి మెప్పించారు.

అయితే మొదట ఈ సినిమాకు దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్ ను పరిశీలించారు. ఈ సినిమా కథ ప్రకారం బాలు పాత్ర ఫెయిల్యూర్ గా నిలిచి మహాలక్ష్మి పాత్ర సినిమాలో విజేతగా నిలుస్తుంది. అయితే ఈ కథ విన్న నాగార్జున కథ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లా ఉందని చెప్పి కథలో మార్పులు చేయించారు. ఆ తర్వాత సుకుమార్ స్క్రిప్ట్ ను మార్చి 100% లవ్ సినిమాను తెరకెక్కించారు. అలా తెరకెక్కిన 100% లవ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

100% లవ్ సక్సెస్ తో తమన్నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కాయి. ఆర్య2 ఫ్లాప్ తో డీలా పడిన సుకుమార్ కు 100% లవ్ సక్సెస్ తో స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు దక్కాయి. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. అక్కినేని అభిమానుల ఆశ నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. నాగచైతన్యకు సైతం మాస్ రోల్స్ తో పోల్చి చూస్తే క్లాస్ రోల్స్ కలిసొస్తున్నాయి.

నాగచైతన్య ప్రస్తుతం ధూత అనే వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు. నాగచైతన్య నటించిన బంగార్రాజు ఈ ఏడాదే విడుదల కాగా ఆయన నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి. నాగచైతన్య ఈ సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.