నటనపై ఆసక్తితో గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసిన జబర్దస్త్ కమెడియన్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చాలామంది ఎంతో తాపత్రయ పడుతుంటారు. ఈ క్రమంలోనే అవకాశాల కోసం ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.తాజాగా నటనపై ఆసక్తితో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జబర్దస్త్ కమెడియన్ వెంకీ. కాకతీయ యూనివర్సిటీ నుంచి డిప్లమా ఇన్ మిమిక్రీలో గోల్డ్ మెడల్ అందుకున్న వెంకీ ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డారు.ప్రభుత్వ ఉద్యోగం చేస్తే కేవలం తన ఊరి ప్రజలకు మాత్రమే తన గుర్తింపు తెలుస్తుంది. అలా కాకుండా తనకు మంచి గుర్తింపు రావడం కోసం ఉద్యోగాన్ని వదిలి ఇండస్ట్రీలోకి వచ్చారు.

ఈ క్రమంలోనే మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేస్తున్న అతనికి చమ్మక్ చంద్ర అవకాశం కల్పించారని అలా జబర్దస్త్ కార్యక్రమం లో చమ్మక్ చంద్ర టీమ్ లో దాదాపు 20 స్కిట్ ల వరకు చేశానని వెంకీ వెల్లడించారు.ప్రస్తుతం తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం చమ్మక్ చంద్ర అని ఈ సందర్భంగా వెంకీ తెలిపారు. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో తనకు లేడీ గెటప్స్ బాగా పేరు తెచ్చి పెట్టాయని వెంకీ వెల్లడించారు.

లేడీ గెటప్ లో చీర కట్టుకొని హెవీ మేకప్ విగ్గు పెట్టుకోవడం ఎంతో కష్టంగా ఉంటుందని, నిజంగా ఆడవాళ్లు ఇవన్నీ వేసుకొని ఎలా మెయింటెన్ చేస్తారో అప్పుడు అర్థం అయిందని ఆయన తెలిపారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వేణు, రాఘవ,చమ్మక్ చంద్ర టీమ్స్ లో పనిచేసిన తనకు మంచి గుర్తింపు రావడంతో ప్రస్తుతం తాను కూడా ఒక టీమ్ లీడర్ గా కొనసాగుతున్నానని వెంకీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.