ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోల్లో రవితేజ కూడ ఒకరు. ఈయనతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తికాకముందే కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను కూడ ఈ ఏడాదిలో ఒకటి వచ్చే ఏడాది ఒకటి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు రవితేజ. ఇక శరత్ మండవ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారు అనేదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన కోసం క్యూలో ఉన్న దర్శకుల జాబితా గట్టిగానే ఉంది.
వారిలో త్రినాథరావు నక్కిన, మారుతి లాంటి దర్శకులతో పాటు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడ ఉన్నారు. బోయపాటి శ్రీను ప్రజెంట్ బాలకృష్ణతో అఖండ చేస్తున్నారు. అది ముగిసిన వెంటనే రవితేజతో వర్క్ చేయాలనేది ఆయన ఆలోచన. రవితేజ సైతం బోయపాటి శ్రీనుకే డేట్స్ ఇచ్చేలా ఉన్నారు. ఎందుకంటే మారుతి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తికావకంటే కాస్త టైమ్ పట్టేలా ఉంది. అందుకే బోయపాటి శ్రీనుతో కమిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బోయపాటి సినిమానే దాదాపు ఫైనల్ అయిందని తెలుస్తోంది.