బిగ్ అనౌన్స్మెంట్ : పాన్ ఇండియా మార్కెట్ లోకి రవితేజ కూడా..!

మాస్ మహరాజ్ రవితేజ స్పీడ్ ఇప్పుడు మామూలుగా లేదని చెప్పాలి. మళ్లీ తన పాత ఫామ్ లోకి రవితేజ వచ్చేసి ఓకే ఏడాది నాలుగు సినిమాలు చేసే స్టేజి కి వచ్చేసాడు. గత రెండు మూడు నెలల్లో కొత్త సినిమాలు అనౌన్స్ చేసిన రవితేజ ఇప్పుడు మరో భారీ సినిమా అనౌన్స్ చేసాడు. “టైగర్ నాగేశ్వరరావు” అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ ప్రీ లుక్ పోస్టర్ తో రవితేజ మొట్టమొదటి సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది.

తెలుగు, హిందీ సహా తమిళ్, కన్నడ మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మాణం వహించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని వంశీ దర్శకత్వం వహిస్తుండగా టాలెంటెడ్ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ భారీ సినిమాని అభిషేక్ అగర్వాల్ రవితేజ లు నిర్మాణం వహిస్తున్నారు. ఫైనల్ గా మాత్రం పలు పాన్ ఇండియన్ హీరోల జాబితాలో మాస్ మహరాజ్ కూడా చేరిపోయాడు అని చెప్పాలి.