RaviTeja : తమిళ హీరోతో కలిసి నటించబోతున్న మాస్ రాజా….!

Ravi Teja : మాస్ రాజా రవితేజకు ప్రస్తుతం మంచి సూపర్ హాట్ సినిమా కావాలి. క్రాక్ తో ట్రాక్ లోకి వచ్చాడనుకుంటే మళ్ళీ ఖిలాడి సినిమాతో డీలా పడ్డాడు. ఇక ఎపుడు టైగర్ నాగేశ్వర్రావు అనే పీరియడిక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ పోస్టర్లు విడుదలయి అభిమానుల్లో ఆశలు పెంచాయి. ఇక రవితేజ కూడా పాన్ ఇండియా మూవీల వైపు చూస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ మెగాస్టార్ చిరు తో కలిసి ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఎపుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.అదే రవి తేజ తమిళ హీరోతో కలిసి సినిమా తీయబోతున్నారనే విషయం.పైగా ఆ సినిమా ను తమ సొంత బ్యానర్స్ పై నిర్మించబోతున్నారట.పాన్ ఇండియా లెవెల్లో సినిమా ప్లాన్ చేస్తున్నారట కూడా.

ఇక వివరాల్లోకి వెళితే విష్ణు విశాల్ అనే తమిళ హీరోతో రవితేజ సినిమా తీయబోతున్నారట. విష్ణు విశాల్ తమిళం లో విడుదలైన ఎఫ్ఐఆర్ అనే సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి లో సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రవితేజతో కలిసి సినిమా తీయబోతున్న విషయాన్నీ చెప్పారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా తెలియజేయనున్నారు. ఇక ఈ సినిమా ద్వి భాషా చిత్రంగా రూపొందుతోంది.