మాస్ మహారాజ రవితేజ తన కెరీర్ లో మళ్ళీ చాలా బిజీగా మారుతున్నాడు. ఎప్పుడు లేని విధంగా రవితేజ ఏకంగా నాలుగు సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడని నిన్ననే మాట్లాడుకున్నాం. మరి రవితేజ కెరీర్ లో 70వ సినిమాని నిన్ననే అనౌన్స్ చెయ్యగా దీనిపై ఇప్పుడు కంప్లీట్ సమాచారం బయటకి వచ్చేసింది.
ఈ చిత్రాన్ని దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో దీనిని అనౌన్స్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పురాతన శిల్పాలు చూపిస్తూ మరింత ఆసక్తి రేపారు. దీనిని బట్టి రవితేజ మళ్ళీ ప్రయోగం చేస్తున్నారా అనిపిస్తుంది. లాస్ట్ టైం డిస్కో రాజా తో పలకరించిన రవితేజ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు.
ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అలాంటి ప్రయోగాత్మక సినిమాలా అనిపిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని రవితేజ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించనున్నారు. వీటన్నిటికీ మించి అదిరే అప్డేట్స్ కూడా రవితేజ ఇచ్చారు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ కూడా ఫిక్స్ చేసి వాటిని నవంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. దీనిని బట్టి రవితేజ స్పీడ్ ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.