ఊహించని ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ తో రవితేజ 70వ సినిమా!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ స్పీడ్ చూస్తుంటే మామూలుగా లేదని చెప్పాలి. ఒక్క ఏడాదిలోనే నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న రవితేజ తన కెరీర్ లో మైల్ స్టోన్ అయినటువంటి 70వ సినిమాను ఇప్పుడు అనౌన్స్ చేసాడు. గత దసరా నుంచి నాన్ స్టాప్ అప్డేట్స్ తో భారీ అనౌన్సమెంట్స్ ఇస్తున్న రవితేజ ఇప్పుడు తన 70వ సినిమాపై బిగ్ అప్డేట్ ని అందించారు.

ఈసారి మాత్రం ఊహించని లెవెల్ కాన్సెప్ట్ పోస్టర్ తో రవితేజ ట్రీట్ ఇవ్వనున్నట్టు అర్ధం అవుతుంది. “రావణాసుర” అనే పవర్ ఫుల్ టైటిల్ తో రవితేజ ఓ భూత వైద్యుడి తరహాలో వరల్డ్ క్లాస్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఇదేదో సోషియో ఫాంటసీ థ్రిల్లర్ లా కూడా అనిపిస్తుంది. మరి దర్శకుడు ఎలాంటి కాన్సెప్ట్ ని టచ్ చేసాడో వేచి చూడాల్సిందే. అలాగే ఈ సినిమా విషయంలో రవితేజ చాలా ఎగ్జైట్ అవుతున్నాని కూడా చెప్తున్నాడు. రవితేజ, అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాపై మరింత సమాచారం రావాల్సి ఉంది.