Ravi Teja Khiladi Trailer : రవి తేజ డబుల్ యాక్షన్ డైనమిక్ ట్రైలర్!

Ravi Teja Khiladi Trailer : మాస్ మహారాజా ఇక వచ్చేస్తున్నాడు… త్వరలో థియేట్రికల్ రిలీజ్ కి ముందు ట్రైలర్ తో వచ్చేశాడు ‘ఖిలాడీ’ అంటూ. డబ్బు కోసం విలన్లతో ఆటాడుకునే ఖిలాడీగా రవితేజ ఇద్దమ్మాయిలతో రోమాన్స్ కూడా సెట్ చేసుకున్నాడు ట్రైలర్ లో. డ్యూయల్ షేడ్స్ వున్న క్యారక్టర్ లో ఒకవైపు ఫన్నీ రోమాంటిక్ బాయ్ గా, ఇంకోవైపు సీరియస్ యాక్షన్ స్టార్ గా ఈ ట్రైలర్ని రసవత్తరం చేశాడు.

‘ఎప్పుడూ ఒకే టీం తో ఆడ్డానికి నేషనల్ ల్ ప్లేయర్నికాను, పేయర్స్ ప్లేయర్ని. ఎవరెక్కువ పాడుకుంటే ఆడికే ఆడతాను’- అన్న మాస్ డైలాగుతో యాక్షన్ ప్రారంభిస్తాడు. కోట్ల రూపాయాల డబ్బు, అదెక్కడుందో కనుక్కునేందుకు ఆట -వేట- పాట…

‘పాపేమో కసక్, నేనేమో ఫసక్’ అంటూ మీనాక్షీ చౌదరీ తో రోమాన్స్ -‘ఫుల్ కిక్కో’ అంటూ సాంగ్. ‘మోహన్ గాంధీ, గాంధీ పేరు పెట్టుకున్న బిర్లా’ అంటూ యాక్షన్ డైలాగు. ‘లోపలి ఫీలింగులు ఎవరికైనా పచ్చిగానే వుంటాయి’ అంటూ రోమాంటిక్ డైలాగు. ఇలా రోమాన్స్, యాక్షన్ రెండు క్యారక్టర్లతో ప్లే అవుతూ సాగుతుంది ట్రైలర్.

#Khiladi​ Movie Trailer | Ravi Teja, Meenakshi Chaudhary | Dimple Hayathi | Ramesh Varma | DSP

 

ఇంకో హీరోయిన్ గా డింపుల్ హయతీ కన్పిస్తుంది. విలన్ గా అర్జున్ నటించాడు. అనసూయ కామెడీ క్యారక్టర్ లో కన్పిస్తోంది. దర్శకుడు రమేష్ వర్మ రవితేజని అభిమానులకి నచ్చే అన్నీ మాస్ అంశాలతో ‘ఖిలాడీ’ ని రూపొందించినట్టు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. సినిమాని స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హుషారెక్కించేలా వుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 11న ‘ఖిలాడీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.