ఇంకో రిలీజ్ కి రెడీ అవుతున్న రవి తేజ

టాలీవుడ్ లో హీరోలు ఒక్కో సినిమా రిలీజ్ కి రెండు, మూడు సంవత్సరాలు తీసుకుంటుంటే, రవి తేజ మాత్రం వెంట వెంటనే సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు రవి తేజ.

‘క్రాక్’ తర్వాత వచ్చిన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా లు డిసాస్టర్ గా నిలిచినా రవితేజ చేతులో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర్రావు’ సినిమాతో బిజీ గా ఉన్న రవితేజ ఈ మధ్యే ‘ధమాకా’ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు.

‘సినిమా చూపిస్త మావ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ధమాకా రొమాంటిక్ గ్లింప్స్, జింతాక్ సాంగ్ ఆకట్టుకుని మూవీ పై ఆడియన్స్ లో మంచి హైప్ ఏర్పరిచాయి. ‘ధమాకా’ మూవీని అక్టోబర్ 21 న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు యూనిట్ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అప్పటికి ‘ఘోస్ట్’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు వచ్చి మూడు వారలు అయిపోతాయి కాబట్టి రవి తేజ సినిమాకు ఏమంత ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ సారైనా రవి తేజ హిట్ కొడతాడేమో చూద్దాం.