Ravi Mohan: కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ ఆయన భార్య ఆర్తి కుటుంబ వ్యవహారం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రవి మోహన్ కుటుంబ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఈ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. తన భార్యతో విడిపోతున్నట్లు జయం రవి అధికారికంగా కూడా ప్రకటించేశారు. ఆర్తి కూడా తన భర్త రవి పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రవి మోహన్ కూడా తన భార్యపై విరుచుకు పడ్డాడు.
ఇలా ఇద్దరు ఒకటి పై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఇంతలోనే వీరి విడాకుల వ్యవహారంలో ప్రముఖ సింగర్ కెన్నీషా పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె కారణంగానే రవి మోహన్ తనకు విడాకులు ఇస్తున్నాడు అంటూ భార్య ఆర్తి ఆరోపిస్తోంది. ఒక పెళ్లి వేడుకలు రవి,కెన్నీషా ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆర్తి చేసిన వ్యాఖ్యలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ కోలీవుడ్ లో కూడా ప్రచారాలు జరిగాయి. అంతే కాకుండా ఇటీవల కూడా రవి మోహన్, కెన్నీషా పూల దండలు వేసుకున్న ఫోటోస్ కూడా నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.
దీంతో వీరు పెళ్లి చేసుకున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. అయితే తమిళనాడు లోని కుంద్రకుడి మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో పూజారులతో కలిసి వీరు తీసుకున్న ఫోటో అని తర్వాత తెలిసింది. కాగా కొద్ది కాలంగా సింగర్ కెన్నీషాపై సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వినిపిస్తోంది. అదేమిటంటే ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రూమర్లపై స్పందించింది కెనీషా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రవి మోహన్ తో రిలేషన్ షిప్, ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న రూమర్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా కేనిషా మాట్లాడుతూ.. చూడండి.. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది.. నేనేమీ గర్భవతిని కాదు.. ఎవరు ఏమి చెప్పినా వారి కర్మ వాళ్లే అనుభవిస్తారు. నిజం, అబద్ధాలు ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తాయి. అప్పటి వరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకుని ప్రశాంతంగా తినండి. అలాగే నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ తన దైన శైలిలో రియాక్ట్ అయ్యింది కెనీషా. ప్రస్తుతం ఈ స్టార్ సింగర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.