అందాల రష్మక మండన్నా వేదాంతం మాట్లాడుతోంది. ‘మనిషిగా మనం కొన్ని లోపాలతో పుట్టి ఉండొచ్చు. కానీ, మనలోని టాలెంట్‌ని మనం గుర్తించగలిగితే జీవితంలో సాధించగలిగేది చాలా ఉంటుంది. నువ్వు ఏం చేయగలవని ప్రపంచం అనుకుంటుందో అంతకు మించి నువ్వు సాధించగలవు.. అందుకు సమయం ఖచ్చితంగా వస్తుంది. అది జరగాలంటే, మొదట నువ్వు నీలోని టాలెంట్‌ను గుర్తించాలి.
అయితే, ఇతరుల ఆధిపత్యం నీ పై ఉండకూడదు. కేవలం నీ శక్తి నీదే. నీలోని భావోద్వేగాలకు నువ్వే యజమానివి. కానీ, వాటిని నీ జీవితంలో అత్యంత విలువైన వారి కోసమే కేటాయించాలి..’ అంటూ ఇంత పొడుగు వేదాంతం చెప్పుకొచ్చింది.
ఎప్పుడూ బబ్లీగా నవ్వుతూ సెటైర్లు వేసే రష్మికలో ఇంత వేదాంతం దాగుందా.? అసలు ఇంత ఎమోషనల్‌గా ఫీలయ్యేందుకు రష్మికను ప్రేరేపించిన ఆ ఇష్యూస్ ఏంటీ.? అని నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు. అలాగే, రష్మిక హార్ట్ టచ్చింగ్ ట్వీట్‌కి నెటిజన్లు బాగా కనెక్టింగ్‌గా ఫీలవుతున్నారు కూడా.
ఇక, టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక ప్రస్తుతం ‘పుష్పరాజ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కి ముందే ఈ సినిమాలో రష్మిక పాత్ర (శ్రీవల్లీ) కు మంచి రెస్పాన్స్ వస్తోంది.