ఆ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా ‘రష్మిక’ !

Rashmika Mandanna About Negativity On Social Media

రామ్ చరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే , సక్సెస్ ఫుల్ నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం చరణ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఇకపోతే , ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటుగా చరణ్ .. తండ్రి మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

ఇందులో రామ్ చరణ్ అతిథిగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఆయన ఇందులో విద్యార్థి నాయకుడుగా కనిపిస్తాడని అంటున్నారు. ఆయన సరసన హీరోయిన్ కూడా వుంటుందట. దాంతో తాజాగా ఆ పాత్రకు రష్మికను సంప్రదించారట. పాత్ర నచ్చడంతో ఆమె ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. వచ్చే ఏడాది ఆమె ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరూ, భీష్మ చిత్రాల విజయాలతో కథానాయిక రష్మిక రేంజ్ టాలీవుడ్ లో బాగా పెరిగింది. స్టార్ హీరోలు చాలామంది ఆమెనే కోరుకుంటూ ఉండడంతో పారితోషికం కూడా పెంచేసింది. అయినా, రష్మికకి పలు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కూడా ఈ ముద్దుగుమ్మకు తాజాగా వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక , ఆచార్య సినిమా షూటింగు విషయానికి వస్తే, గత కొన్నిరోజులుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. చిరంజీవి కూడా తాజాగా షూట్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఆయనపై యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.