Rashmika Mandanna : టాలీవుడ్ టాప్ హీరోయిన్ చెయిర్ వైపు దూసుకెళ్తోన్న రష్మికా మండన్నా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వరుస సక్సెస్‌లతో దూకుడు చూపిస్తోన్న ఈ అమ్మడు రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట. రష్మక సక్సెస్ రికార్డు చూసి, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి అయినా సరే, తమ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకోవడానికి మేకర్లు వెనకాడడం లేదట.
రీసెంటుగా ‘పుష్ప’ సినిమాలో ‘శ్రీవల్లి’ రష్మిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్యాన్ ఇండియా దృష్టిని ఆకర్షించింది ఈ సినిమాతో రష్మిక. అసలు విషయంలోకి వెళితే, రామ్ పోతినేని, బోయపాటి శీను కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీ తెరకెక్కబోతోంది. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో రూపొందించే యోచనలో వున్నారట. ఆ క్రమంలోనే రష్మిక మండన్నాని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారనీ తెలుస్తోంది. ఈ సినిమా కోసం రష్మికకు షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట కూడా. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇస్తే, రష్మిక కాదనే ఛాన్సే లేదుగా.
మరోవైపు రష్మిక తెలుగుతోపాటు, కోలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ కూడా పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో బిజీగా వుంది. ఇక రామ్ విషయానికి వస్తే, ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ‘రెడ్’ కాస్త నిరాశపరిచినా, ‘అఖండ’ హిట్‌తో ఫుల్ స్వింగ్ మీదున్న బోయపాటి సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్సే పెట్టుకున్నాడట. ప్రస్తుతం ‘ది వారియర్’ సినిమాలో నటిస్తున్నాడు రామ్ పోతినేని.