ఈ ఛాన్స్ దొరికితే మాత్రం రష్మికను ఆపలేం

Rashmika Mandanna to get golden chance

Rashmika Mandanna to get golden chance

శంకర్ సినిమాల్లో నటించాలనేది ప్రతి ఒక్కరి కల. ఆయన సినిమాలో లీడ్ రోల్స్ చేస్తే స్టార్ హీరోయిన్ అనే సర్టిఫికెట్ దొరికినట్టే. పైగా అయన సినిమాల్లో దొరికే పాత్రలు ఆషామాషీగా ఏమీ ఉండవు. ప్రతి పాత్రకీ ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఆయనతో వర్క్ అంటే అందరికీ అంత ఆసక్తి. అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ చాలా తక్కువమందికి దొరుకుతుంటుంది. అలాంటి అరుదైన అవకాశం రష్మిక మందన్నకు దొరికేలా ఉంది.

ప్రజెంట్ శంకర్ రామ్ చరణ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడ రాజకీయ నేపథ్యంలో సాగే సోషల్ డ్రామానే. దిల్ రాజు భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీప్రోడక్షన్ పనులు మొదలయ్యాయి. జూన్ నుండి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఇందులో కథానాయకిగా పలువురి పేర్లు వినబడినా ఇప్పుడు మాత్రం రష్మిక మందన్న పేరు గట్టిగా వినబడుతోంది. ఇందులో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే రష్మిక కెరీర్ గొప్ప టర్న్ తీసుకున్నట్టే.