Rashmika Mandanna : లైవ్ లో అల్లు అర్జున్ కి ప్రపోజ్ చేసి షాకిచ్చిన రష్మికా మందన్నా.. దద్దరిల్లిన గ్రౌండ్

Rashmika Mandanna : ఇప్పుడు మన టాలీవుడ్ సినిమాలో మంచి హాట్ కేక్ లా మారిన స్టార్ హీరోయిన్ లలో టాలెంటెడ్ హీరోయిన్ రష్మికా మందన్నా కూడా ఒకామె. తన గత సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన “సరిలేరు నీకెవ్వరు” తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప పార్ట్ 1″తో పలకరించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో చాలా డీ గ్లామరస్ రోల్ లో కనిపించింది.

కానీ నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అయితే మళ్లీ ఇన్నాళ్లకు ఓ పెద్ద ఫంక్షన్ లో మాట్లాడిన ఈ యంగ్ హీరోయిన్ లైవ్ లో ఐకాన్ స్టార్ కి ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేసేయ్యడం ఒక్కసారిగా అక్కడ వారి అందరికీ షాక్ ఇచ్చింది. రష్మికా ఈ షాకింగ్ ప్రపోజ్ చెయ్యడంతో గ్రౌండ్ కూడా అభిమానుల గోలతో ఒక్కసారిగా దద్దరిల్లింది.

తర్వాత రష్మికా ఇది గ్రహించి మళ్లీ టీం అందరికీ దర్శకుడు సుకుమార్ కి కూడా ఐ లవ్ యు అంటూ ముగించింది. కానీ ఫస్ట్ ఫస్ట్ అల్లు అర్జున్ కే ఆమె ఐ లవ్ యు చెప్పడం మాత్రం వీక్షకులను ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఇక వీరు ఎంతో కష్టపడి చేసిన భారీ సినిమా పుష్ప వచ్చే డిసెంబర్ 17న రిలీజ్ కానుంది ఇది ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.