Rashmika Mandana: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట ఇప్పటికే పలుమార్లు బయట కనిపించడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది. దీనితో విజయ్ రష్మిక లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇప్పటికే ఈ విషయం పై విజయ్ దేవరకొండ స్పందించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఇదే విషయంపై రష్మిక మందన స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ వాలి డేటింగ్ విషయం గురించి పెళ్లి విషయం గురించి తన దృష్టికి వచ్చాయని ఇలాంటి రూమర్లు తనకు కొత్తేమీ కాదని ఆమె తెలిపింది. అంతేకాకుండా ఇలాంటి వార్తలు విని నవ్వుకోవడం అలవాటు అయిపోయింది అని తెలిపింది రష్మిక మందన్న.వీటిని పట్టించుకునే సమయం కూడా తనకు లేదని చెప్పుకొచ్చింది. రష్మిక చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్స్ మరోవిధంగా స్పందిస్తూ, వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా లేకపోయినప్పటికీ మీరు ముంబై కి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నిస్తున్నారు? మరి ఈ విషయంపై రష్మిక అదే విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.