తమ కెరీర్ ఆరంభించిన తక్కువ కాలంలోనే స్టార్ట్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకోవడం పైగా దానిని నిలబెట్టుకోవడం అనేది టాలీవుడ్ లో చాలా తక్కువ మందికే కుదిరింది అని చెప్పాలి. పైగా లక్కీ హీరోయిన్ అనే స్టాంప్ వేసుకోవడం కూడా విషయం ఏమీ కాదు మరి అలాంటి స్టార్ హీరోయిన్స్ లో గూగుల్ డిసైడ్ చేసిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా ఉంది.
అయితే రష్మికా ఇప్పుడు వరకు ఎన్నో రోల్స్ చేసింది కానీ తన ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఈ సినిమాలో అసలు తాను ఎలా కనిపిస్తుంది అనేది మాత్రం నిన్న క్లారిటీ వచ్చింది. రష్మికా ముందు లుక్స్ కన్నా నిన్న సాంగ్ లో మరింత అందంగా కనిపించడం కొన్ని అంచనాలు పెట్టుకున్న వాళ్ళని ఆశ్చర్యపరిచింది.
పైగా ఈ సినిమాలో తన ఎక్స్ పోజింగ్ మోతాదు కూడా పెంచడం అలాగే డీ గ్లామరస్ లుక్ ని ఆమె చేయడం వంటివి ఇప్పుడు మూవీ లవర్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశాలు.