రష్మిక డబుల్ ధమాకా: దేనికవే సాటి

Rashmika Mandanna Double Dhamaka | Telugu Rajyam

కన్నడ కుట్టీ రష్మిక మండన్నా నుంచి త్వరలో రెండు సినిమాలు రానున్నాయి. అందులో ఒకటి అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ మూవీ కాగా, మరో సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఓ వైపు ‘పుష్ఫ’ షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమానీ కంప్లీట్ చేసేస్తోంది రష్మిక మండన్నా.

ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎలా ఉండబోతోందనే అంశంపై చర్చ జరుగుతోంది. ‘పుష్ప’ కోసం ‘శ్రీ వల్లి’గా డీ గ్లామర్ అవతారమెత్తిన రష్మిక, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలోనూ సరికొత్త పాత్రలో కనిపించబోతోందట.

టైటిల్‌ విషయానికి వస్తే, హీరోయిన్ సెంట్రిక్ అనిపించేలా ఉంది. సో రష్మిక పాత్రకు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉండోబోతోందనీ టైటిల్ బట్టి అర్ధం చేసుకోవచ్చు. త్వరలోనే ఆ విషయమై ఓ క్లారిటీ రానుందట. కిషోర్ తిరుమల దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న కూల్ అండ్ లవ్‌లీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles