Rashmika Mandanna : “పుష్ప 2” కోసం రష్మికా మందన్నా అంత డిమాండ్ చేస్తుందా..?

Rashmika Mandanna : ప్రెజెంట్ మన టాలీవుడ్ లో ఉన్నటువంటి కొంతమంది లక్కీ హీరోయిన్స్ జాబితాలో రష్మికా మందన్నా పేరు కూడా ఉంటుంది. పెద్దగా అందం లాంటిది లేకపోయినా మంచి టాలెంట్ ఆమెలో ఉంది పైగా తాను చేసిన సినిమాల్లో హిట్ ట్రాక్ నే ఎక్కువ ఉండడంతో పెద్ద పెద్ద నిర్మాతలు స్టార్ హీరోలతో చేయబోయే భారీ సినిమాలకు ఈ హీరోయిన్ ని కూడా ఒకే చేసుకుంటున్నారు.

మరి ఇదిలా ఉండగా రష్మికా అందుకున్నా లేటెస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ ఏంటి అంటే అది “పుష్ప”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సాలీడ్ హిట్ అయ్యింది. మరి ఈ చిత్రంలో రష్మికా కి కూడా చాలా కీలకమైన పాత్రని రాసారు. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో రష్మికా పార్ట్ 2 కోసం భారీ గానే డిమాండ్ చేస్తుందట.

మొదట రెండు కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకునే ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు పార్ట్ 2 కోసం ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్ట్ గా మారిన హాట్ టాపిక్. అయితే నిర్మాతలు కూడా ఇంత మొత్తాన్ని చెల్లించడానికి ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో రష్మికా పాత్ర ఇంకెంత కీలకంగా కనిపిస్తుంది అనేది చూడాలి.