Rashmika Jhalak To Pooja Hegde : పూజా హెగ్దేని దెబ్బ కొట్టిన రష్మిక.!

Rashmika Jhalak To Pooja Hegde

Rashmika Jhalak To Pooja Hegde : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా చెప్పుకునే సమంత, కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే, రష్మికా మండన్నాలలో సమంత ట్రాక్ మార్చేసింది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌తో బిజీగా వుంది. కాజల్ స్టార్ హీరోలకు ఆప్షన్‌గా మారింది. అందునా, ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా కాస్త బ్రేక్ తీసుకుంది కాజల్ అగర్వాల్.

ఇక మిగిలిన పూజా హెగ్దే, రష్మికా మండన్నాలలో ఇద్దరూ ఇద్దరే. వరుస అవకాశాలతో ఇటు సౌత్‌లోనే కాదు, నార్త్‌లో కూడా దుమ్ము దులిపేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ పూజా హెగ్దేనే రేసులో ముందుండేది. కానీ, ఇప్పుడు రష్మిక రేసులోకి దూసుకొచ్చింది.

పూజా హెగ్దేని మించిన అవకాశాలు దక్కించుకుంటోంది. దాంతో పూజా హెగ్దే కంటే, రష్మిక బెటర్ కొన్ని విషయాల్లో.. అంటూ ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారట. ఇంతకీ ఆ కొన్ని విషయాలేంటంటే, ముఖ్యంగా ప్రమోషన్స్‌ని ప్రామాణికంగా తీసుకుంటున్నారట.

యాక్టింగ్ టాలెంట్‌లో ఎవ్వర్నీ వంక పెట్టడానికి లేదు. ఎవరి స్పెషాలిటీస్ వాళ్లవి వీరిద్దరికీ సంబంధించినంతవరకూ. అలాగే, రెమ్యునరేషన్ కంఫర్ట్స్‌లోనూ ఇద్దరిలోనూ ఒకరికొకరు తీసిపోరు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో పూజా హెగ్దే కన్నా, రష్మికా మండన్నాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయట.

ప్రమోషన్స్‌లో రష్మికా ఎట్రాక్టివ్ థీమ్స్‌ని పరిగణనలోనికి తీసుకుంటున్నారట. నిజానికి ప్రమోషన్స్‌లో పూజా హెగ్దే కూడా తక్కువేం కాదు. చాలా కష్టపడుతుంది. ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్‌లో పూజా యూజ్ చేసిన టెక్నిక్స్ అన్నీ ఇన్నీ కావు. చాలా చాలా కష్టపడింది పాపం.

కానీ, ఎవరి లెక్కలు వాళ్లవి. ట్రేడ్ వర్గాల లెక్కలు మరోలా వున్నాయట. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ పరిశ్రమల్లోనూ ఈ పోలికలు బాగా మొదలైపోయాయ్ ఇప్పుడు. అందులో రష్మిక, పూజా హెగ్దే మెయిన్ టార్గెట్ అయ్యారు.