రానా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాలోమన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈరోజే చిత్రం రిలీజవుతోంది. భారీ వ్యయంతో నిర్మితమైంది ఈ సినిమా. హిందీలో రిలీజ్ కాలేదు కానీ తెలుగు, తమిళంలో విడుదలైంది. సుమారు 60 కోట్ల సినిమాను రూపొందించారు నిర్మాతలు. సినిమాను అన్ని చోట్లా నిర్మాతలే ఓన్ రిలీజ్ చేస్తున్నారు. నాన్ థియేట్రికల్ బిజినెస్ అనగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజినెస్ బాగానే జరిగిందట. అయినా కూడ థియేట్రికల్ బిజినెస్ పరంగానే ఎక్కువ మొత్తంలో వెనక్కు రావాల్సి ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా మేరకు ఈ సినిమా వసూళ్లు కనీసం 35 కోట్ల వరకు ఉంటేనే నిర్మాతలు సేఫ్ అవుతారని తెలుస్తోంది. నిజానికి రానాకు ఇది పెద్ద టార్గెట్ అనే అనాలి. సినిమాకు హిట్ టాక్ వచ్చినా అంత భారీ మొత్తం వెనక్కు రావడం కష్టమే. మరి నిర్మాతలు రానా మీద ఏ ధైర్యంతో అంత పెద్ద మొత్తం పెట్టారు అంటే హిందీ మార్కెట్ మీద ఆశలు పెట్టుకుని. హిందీలో సినిమాకు హిట్ టాక్ వస్తే 35 కోట్లు పెద్ద లెక్కేమీ కాదు. కానీ ఇప్పుడు హిందీలో సినిమాలో రిలీజ్ లేదు. ఎప్పుడు అవుతుందో తెలీదు. కాబట్టి తెలుగు, తమిళం నుండే పెట్టుబడి వెనక్కు రావాలి. మరి అది ఎంతవరకు సాధ్యమనేదే పెద్ద ప్రశ్న.