Rana: వెంకటేష్ ను బూతులు తిట్టిన రానా… ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదంటూ?

Rana: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో మంచి ఆదరణ ఉందని చెప్పాలి. దగ్గుబాటి వెంకటేష్ బాబు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇక రానా కూడా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందు రావడమే కాకుండా, కథ బాగుంటే విలన్ పాత్రలలో నటించడానికి కూడా వెనకాడటం లేదు. ఇలా ఇప్పటికే పలు విలన్ పాత్రలలో రానా నటించిన విషయం తెలిసిందే .ఇక తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇక వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుంది కొన్ని సందర్భాలలో రానా బూతులు కూడా తిట్టిన విషయం తెలిసింది.

ఇలా ఫస్ట్ సిరీస్ లో రానా వెంకటేష్ పై బూతులు మాట్లాడటంతో తాజాగా అలా మాట్లాడటం గురించి రానా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. బాబాయ్ నాకు మధ్య చాలా మంచి బార్ండింగ్ ఉన్న నేపథ్యంలో సీరియస్ సన్నివేశాలను కూడా చాలా అవలీలగా చేశామని రానా తెలిపారు. ఇక హిందీలో డబ్బింగ్ కూడా చాలా సులభంగానే చెప్పాను కానీ తెలుగులో మాత్రం చెప్పలేకపోయానని తెలిపారు.

తెలుగులో డబ్బింగ్ చెప్పేటప్పుడు బాబాయిని బూతులు తిట్టాల్సి వచ్చింది అలా తిడతానని నేను కలలో కూడా ఊహించుకోలేదు. ఇలా డబ్బింగ్ చెప్పేటప్పుడు కాస్త ఇబ్బంది పడ్డానని రానా తెలియచేశారు. అయితే మనం వ్యక్తిగతంగా వారిని తిట్టలేదని ఒక పాత్రలో లీనమై నటించాము కనుక ఆ పాత్రకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే రిలేషన్స్ పక్కన పెట్టి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బింగ్ పూర్తి చేశానని రానా తెలియచేశారు. ఇక ఫస్ట్ సిరీస్ ఎంత అద్భుతమైన విజయం అందుకోగా త్వరలోనే రానా నాయుడు2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.