Ram Vs Bheem : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రెండు ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల మధ్య సంఘర్షణ.! ఇంతకీ, రాజమౌళి ఎవరి వైపు నిలబడ్డాడు.? ఇది కాస్త కష్టమైన ప్రశ్నే. సినిమా అంటే ఒక్కడే హీరో వుండాలన్న మూస ధోరణిని పక్కనపెట్టి రాజమౌళి చేసిన సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ గురించి చెప్పుకోవాలి. రామ్, భీమ్.. రెండూ వేర్వేరు పాత్రలు. ఈ రెండిటికీ సినిమాలో సమప్రాధాన్యం ఇవ్వాల్సిందే.
స్క్రీన్ మీద ఎవరెంత సేపు కనిపించారన్న విషయమై లెక్కలు పక్కగా వుంటాయ్. వుండాలి కూడా. లేకపోతే, అభిమానులు ఊరుకోరు. మరి, రాజమౌళి ఏం చేశాడు.? ఏ పాత్రని ఎక్కువ అద్భుతంగా సృష్టించాడు.? ఏమోగానీ, తాను రాసిన రెండు పాత్రల గురించి రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
భీమ్ పాత్రలో కల్మషం వుండదు. ఎన్టీయార్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆ పాత్ర చాలా బావుంటుంది. అయితే, రామ్ చరణ్ పాత్ర సంగతి వేరు. చాలా లేయర్స్ వుంటాయి ఆ పాత్రలో. చాలా చాలా మెచ్యూర్డ్ పాత్ర అది. రచయితగా నాకు ఆ పాత్రంటే చాలా ఇష్టం. అది చేయడం చాలా కష్టం కూడా. చరణ్ చాలా బాగా చేశాడు.. అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో విజయేంద్రప్రసాద్ ఎక్కడా కనిపించడంలేదన్న ప్రచారానికి ఆయన ఇచ్చిన తాజా ఇంటర్వ్యూతో తెరపడిందని అనుకోవాలేమో. ఇంతకీ విజయేంద్రప్రసాద్ చెప్పినట్టే చరణ్ పాత్రకు అదనపు ప్రాధాన్యత సినిమాలో వుంటుందా.? అదీ ఎన్టీయార్ పాత్ర కంటే.?
లేదా, రాజమౌళి ఏదన్నా జిమ్మిక్కు చేశాడా.? మరికొద్ది గంటల్లో సస్పెన్స్ వీడిపోనుంది.