Ram Gopal Varma : ఒమిక్రాన్ విషయంలో “RRR” కి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన వర్మ.!

Ram Gopal Varma : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ వణికిస్తున్న కొత్త వైరస్ “ఒమిక్రాన్”. ఇది ఇప్పుడు మన దేశంలో కూడా విజృంభిస్తుండగా నిన్ననే రాత్రి మళ్ళీ జాతిని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రసంగం ఇవ్వడంతో మళ్ళీ కాస్త టెన్షన్ పడుతున్నారు.

అయితే దీనికి వాక్సిన్ వేసుకోడం తగు జాగ్రత్తలు తీసుకోడం తప్పనిసరి అని అందరికీ తెలుసు. అయితే దీనికి గాను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అద్భుతమైన సొల్యూషన్ చెబుతున్నాడు. దీనికి గాను పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రిపుల్ ఆర్(RRR) తో కలిపి చెప్పాడు.

RRR ఎలాగో భారీ ఎత్తున సినిమా థియేటర్స్ కి జనం వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరినీ రెండు డోసులు వాక్సిన్ వేసుకుంటేనే అలో చెయ్యండి చెయ్యండి అలా అయితే ఈ సినిమా చూడడం కోసం అయినా జనం ఈ వాక్సిన్ వేసుకుంటారు.

అప్పుడు ఒమిక్రాన్ విషయంలో ఎవరు భయపడక్కర్లేదు అని తెలిపాడు. అంటే ఇప్పటి వరకు భాద్యత లేకుండా ఉన్న ప్రజలు ఆ రేంజ్ లో RRR సినిమాకి వస్తారు అని వర్మ ఈ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు.