Gallery

Home News ఇదేంద‌య్యా రామ్.. నీ సినిమా ప్ర‌మోష‌న్‌లో ప‌క్కోడి సినిమా టికెట్ ప్ర‌ద‌ర్శించిన‌వ్‌!

ఇదేంద‌య్యా రామ్.. నీ సినిమా ప్ర‌మోష‌న్‌లో ప‌క్కోడి సినిమా టికెట్ ప్ర‌ద‌ర్శించిన‌వ్‌!

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీని వ‌ల‌న ఏ వార్త అయిన క్ష‌ణాల‌లో వైర‌ల్ కావ‌డం, ఎక్కడో విదేశాల‌లో జ‌రిగిన ఇన్సిడెంట్ కొద్ది క్ష‌ణాల‌లో మ‌న దృష్టికి రావ‌డం జ‌రుగుతుంది. ఇక సినిమా సెల‌బ్రిటీల‌కు సంబంధించిన విష‌యంలో ఏదైన త‌ప్పు జ‌రిగితే అంతే సంగ‌తులు. ఆ వార్త‌ని హైలైట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు ఇస్మార్ట్ హీరో రామ్ విష‌యంలో అదే జరిగింది. సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న రెడ్ ప్రీ రిలీజ్ వేడుక గ‌త రాత్రి ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు.

Ram Red | Telugu Rajyam

గ్రాండ్‌గా నిర్వ‌హించిన ఈ వేడుక‌లో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ .. స్ర‌వంతి రవి కిషోర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఆయ‌న లేక‌పోయి ఉండి ఉంటే నేను ఈ స‌మ‌యంలో ఇక్క‌డ ఉండే వాడిని కాదు. స్వయంవరం సినిమా తరవాత నాకు ఎందుకో ఎవరూ సినిమాలు ఇవ్వలేదు. దీంతో భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే.. నాకు ఫోన్ చేసి అక్కడి నుంచి పిలిపించి నాతో ‘నువ్వే కావాలి’ రాయించారు. సార్.. నేను మీకు ఆ విషయంలో చాలా రుణపడి ఉన్నాను అంటూ చాలా ఎమోష‌న్ అయ్యారు.  ఆ త‌ర్వాత‌ స్ర‌వంతి ర‌వికిషోర్ కాళ్లు మొక్కాడు.

అంతే స‌జావుగానే సాగిన టికెట్ లాంచ్ స‌మ‌యంలో ఘోర తప్పిదం చేశారు. ఎవ‌రు ప‌ట్టించుకోకుండా రెడ్ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు బ‌దులు ర‌వితేజ సినిమా క్రాక్ టికెక్‌టు లాంచ్ చేశారు. దానిపై రిలీజ్ డేట్ జ‌న‌వ‌రి 9న ఉంది. త‌న సినిమాల‌కు బ‌దులు ర‌వితేజ సినిమా ప్ర‌మోష‌న్ చేయ‌డంపై రామ్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. రెడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి క్రాక్ సినిమాని ప్ర‌మోట్ చేయ‌డం ఏంట‌ని మండిప‌డుతున్నారు. మొత్తానికి అడ్డంగా రామ్ బుక్ అవ‌డంతో యాంటీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు

 

- Advertisement -

Related Posts

Walking: ఆరోగ్యానికి ‘వాకింగ్’..! ఎంతసేపు, ఎంత దూరం, ఎలా నడవాలి..? సూచనలివే..

Walking: వాకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గతంలోనూ డాక్టర్లు చెప్పిన విషయమే. కాకపోతే.. ప్రస్తుత కరోనా సమయంలో వాకింగ్ ప్రయోజనాలు బాగా తెలిసొచ్చాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా ఒక్కటే కాదు.....

భారతరత్నమే.. సోనూ సూద్‌కి డబ్బులెలా వస్తున్నాయ్.?

ఎవరన్నా సాయం అడిగితే చాలు, 'మీరేం ఆందోళన చెందాల్సిన పనిలేదు.. మీ సమస్య తీరిపోతుంది..' అని భరోసా ఇస్తున్నాడు సోనూ సూద్. ఇదెలా సాధ్యమవుతోంది.? ప్రభుత్వాలు చెయ్యలేని పనిని, సోనూ సూద్ ఎలా...

వైజాగ్ నాట్ ఫర్ సేల్.! స్టీల్ ప్లాంట్ సంగతేంటి.?

విభజన గాయాల నుంచి ఇంకా ఆంధ్రపదేశ్ రాష్ట్రం కోలుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే వుంది. కేంద్రం నుంచి తగిన సాయం అందకపోవడంతో, అప్పులు చేయడం తప్ప రాష్ట్రాన్ని నడిపేందుకు ప్రభుత్వాలకు మరో మార్గం...

Latest News