Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 10వ తేదీ స్వయంగా రామ్ చరణ్ ఈ విగ్రహావిష్కరణ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మెగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక రాంచరణ్ మైనపు విగ్రహంతో ఉపాసనతో పాటు సురేఖ చిరు దంపతులు కూడా ఫోటోలు దిగారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే క్లీన్ కారా మాత్రం తన తండ్రి ఎవరా అంటూ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిందని తెలుస్తోంది. రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత రామ్ చరణ్ తన పెట్ రైమ్ తో కలిసి విగ్రహంతో పాటు కూర్చుని ఫోటోలకు ఫోజులిస్తున్న తరుణంలో ఒక్కసారిగా క్లీన్ కారా వేదిక పైకి వెళ్ళింది.
ఇలా పైకి వెళ్లిన క్లీన్ కారా ఇద్దరిలో తన తండ్రి ఎవరా అంటూ కన్ఫ్యూజ్ కావడమే కాకుండా రామ్ చరణ్ దగ్గరకు కాకుండా విగ్రహం వద్దకు వెళ్ళిపోగా రామ్ చరణ్ తన కూతురును తిరిగి తన వద్దకు తీసుకున్నారు. దీంతో క్లీన్ కారా తన తండ్రిని గుర్తుపట్టే అక్కడికి వచ్చింది లేదంటే మైనపు విగ్రహం వద్దకు వెళ్ళిపోయేదని తెలుస్తుంది. ఇక ఉపాసన కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో భాగంగా రాంచరణ్ స్టాచుతో కలిసి ఆమె విడిగా ఫోటోలు దిగారు అలాగే సురేఖ కూడా తన కొడుకు విగ్రహంతో కలిసి ఫోటోలు దిగారు.
ఇలా రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఫోటోలు దిగడంతో ఇవి కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ పెట్ రైమ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడంతో ఇది కూడా సెలబ్రిటీగా మారిపోయిందని చెప్పాలి.