రామ్ చరణ్ హీరోగానే కాదు నిర్మాతగానూ విజయవంతంగా కొనసాగుతున్నారు. భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. తండ్రితో ‘ఖైదీ నెం 150, సైరా’ సినిమాలను నిర్మించి ప్రస్తుతం ‘ఆచార్య, చిరు 153’ సినిమాలను కూడ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తండ్రితోనే సినిమాలు చేసిన ఆయన ఇకపై బయట హీరోలతోనూ వర్క్ చేయాలని అనుకుంటున్నారు. అందుకే రవితేజను చూజ్ చేసుకున్నారు. మాస్ మహారాజాతో ఒక రీమేక్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట అయన.
మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాను రవితేజ హీరోగా రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రని రవితేజతో చేయిస్తారట. ఇంకొక పాత్రకు ప్రముఖ నటుడ్ని తీసుకోనున్నారట. దర్శకుడు ఎవరనే సంగతి ఇంకా బయటకురాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తయ్యాక ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలున్నాయి.