Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం లభించింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు.. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చరణ్ ఇప్పటికే ఎన్నో అవార్డులు పురస్కారాలు లభించాయి.
తాజాగా రామ్ చరణ్ కుమార్ ఒక అరుదైన గౌరవం లభించింది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు అంటే స్టార్ హీరోలకు సంబంధించిన మైనపు విగ్రహాలను ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ రైమ్ విగ్రహాన్ని కూడా మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ విగ్రహావిష్కరణకు సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు. భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం స్వయంగా రామ్ చరణ్ తన విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఎంతో సంబరం వ్యక్తం చేస్తున్నారు.
Here we gooo…🌟#RamCharanWaxStatue@AlwaysRamCharan x @MadameTussauds pic.twitter.com/4ODzG4zlDT
— Trends RamCharan ™ (@TweetRamCharan) May 10, 2025
ఇక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు చిరంజీవి సురేఖ దంపతులు కూడా గత కొద్ది రోజుల క్రితమే లండన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇలా ఈ విగ్రహ ఆవిష్కరణ అనంతరం రామ్ చరణ్ తన మైనపు విగ్రహంతో పాటు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్న ఈ విగ్రహాన్ని త్వరలో సింగపూర్ మ్యూజియంలోకి మార్చనున్నారు.