శంకర్ భారీ సినిమాకి ఈ వర్క్స్ స్టార్ట్ చేసిన చరణ్.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియాలో టాప్ దర్శకులలో ఒకరైన దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం ఈ ఇద్దరి కెరీర్ లో కూడా 15వ సినిమా కావడంతో వారికి ఇది మరింత స్పెషల్ గా మారింది. అయితే ఈ భారీ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

గత వారం కిందే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈరోజు నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసుకోనుంది. అయితే ఈ షెడ్యూల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ షూట్ కూడా ఉందట. దీనికి గాను ఇప్పుడు రామ్ చరణ్ డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాడని సమాచారం. అసలే శంకర్ తన హీరోల నుంచి ఓ రేంజ్ లో అవుట్ పుట్ రాబట్టగలడు.

అలాగే పాటలు కూడా మరోస్థాయిలో సెట్ చేస్తాడు. ఇక ఈ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని పక్కా బడ్జెట్ ప్లాన్ తో నిర్మాణం వహిస్తున్నారు.