Ram Charan : ఇండస్ట్రీ టాక్ : శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఏంటో తెలిసిపోయింది.!

Ram Charan : ఇప్పుడు మన తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. తన లేటెస్ట్ భారీ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) సక్సెస్ తో ఇంకా చెప్పాలంటే దాని కన్నా ముందే పాన్ ఇండియా లెవెల్లో తన గ్రేస్ ని చూపించాడు.
అయితే రాజమౌళి లాంటి దర్శకుడు ఇంకో పక్క ఇండియా మరో టాప్ దర్శకుడు శంకర్ తో సినిమాలు చేసిన ఏకైక ఇండియన్ హీరోగా చరిత్రకెక్కగా ఇప్పుడు రాజమౌళి వంతు కాగా నెక్స్ట్ శంకర్ వంతు వచ్చింది.
అయితే దీన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా అసలు ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది తెలిసిపోయింది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడట. మొదటగా ఒక స్టూడెంట్ పాత్రలోని ఆ తర్వాత ఒక ప్రభుత్వ అధికారిగా కనిపిస్తాడని తెలుస్తోంది.
అలాగే ఫ్లాష్ బాక్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది కానీ ఆ రెండు షేడ్స్ అయితే మాత్రం చరణ్ నుంచి ఖాయం అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.