Magadheera: టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కెరీర్ అమాంతం పెరిగిపోయిందని చెప్పటంలో సందేహం లేదు . మగధీర సినిమా స్టోరీ రామ్ చరణ్ కి వివరించే సందర్భంలో జరిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది .
మెగా కుటుంబంలో హీరోలు సినిమా చేయాలంటే తప్పనిసరిగా ఆ కథ మెగాస్టార్ చిరంజీవి గారు వింటారు అనే విషయం అందరికీ తెలిసిందే.చిరంజీవి గారు కథ విన్న తర్వాత అందులో ఏమైనా మార్పులు చేయవలసి వస్తే వాటి గురించి సూచనలు అందిస్తుంటారు . చిరంజీవి గారు మెగా హీరోలకు తొలినాళ్లలో కథ మొదటి నెరేషన్ నుండి వింటూ వారికి సూచనలు ఇస్తుండేవారు . అయితే మగధీర సమయంలో రాజమౌళి గారు రామ్ చరణ్ కి సన్నివేశాల గురించి వివరిస్తున్నప్పుడు చిరంజీవి ఆసక్తిగా వినేవారట . ఈ సందర్భంలోనే చిరంజీవి గారు మగధీర సినిమాలో హీరో తనే అనుకున్నాడట .
తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రచార ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు . మగధీర కథ వింటున్నప్పుడు మీకేమనిపించింది అని యాంకర్ అడగగా..’ నా సంగతి ఇ పక్కన పెడితే.. ఓసారి రాజమౌళి సన్నివేశం గురించి వివరిస్తున్నప్పుడు చిరంజీవి గారు యాక్టివా అయిపోయి.. ఈ సీన్ లో నేను ఇలా చేస్తే బాగుంటుంది కదా? అని అడిగారట .దీంతో రాజమౌళి సర్ ఈ సినిమాలో హీరో మీరు కాదు , రామ్ చరణ్ ‘ అని చెప్పారట . దీంతో చిరంజీవి ‘ అవును కదా ‘ అని మరి కథ విన్నరట . చిరంజీవి గారు అలా అనుకోవడంలో తప్పులేదు ఎందుకంటే రాజమౌళి తన సినిమాలు కథలను అంత అద్భుతంగా నెరేట్ చేస్తరు గనుక అంటూ చరణ్ మగధీర సినిమా గురించి ఈ విషయాన్ని బయటపెట్టారు.