ఆర్ఆర్ఆర్‌లో త‌న పాత్ర‌పై క్లారిటీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌.. షాక్‌లో రాజ‌మౌళి!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇందులో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ క‌నిపించ‌నుండ‌గా, ఈ పాత్ర‌కు సంబంధించిన లుక్ ఇప్ప‌టికే విడుద‌లైంది. ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో చ‌ర‌ణ్‌ని చూసిన‌ మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ ఆచార్య సినిమాలోను న‌టిస్తున్నాడు. ఇందులో సిద్ధ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, ఇటీవ‌ల అత‌ని ప్రీ లుక్ ఒక‌టి విడుద‌ల చేశారు మేక‌ర్స్.

Ram | Telugu Rajyam

ఆర్ఆర్ఆర్ చిత్రం విష‌యానికి వ‌స్తే కాల్ప‌నిక గాథ‌తో1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నాడు రాజ‌మౌళి. ఈ సినిమా అక్టోబ‌ర్ 13, 2021న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ప‌లుసార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం ఆ డేట్ కు మాత్రం థియేట‌ర్స్ లో త‌ప్ప‌క వ‌స్తుంద‌ని అంటున్నారు. అయితే రాజ‌మౌళి సినిమాల‌కు సంబంధించిన సీక్రెట్స్ ఎక్క‌డా ఎవ‌రు రివీల్ చేయ‌కూడదు. హీరోలు కూడా త‌మ పాత్ర ఏంట‌నే విష‌యాన్ని చివ‌రి వ‌ర‌కు చెప్ప‌కూడ‌దు. ఇలాంటి కండీష‌న్స్‌తో సినిమాలు చేస్తుంటాడు రాజ‌మౌళి. మంగ‌ళ‌వారం పోలీస్ శాఖ వార్షిక క్రీడోత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర గురించి మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్‌’లో తాను పోలీస్‌గా క‌నిపిస్తాన‌ని.. అల్లూరి పాత్ర‌కు మేక‌ప్ వేయ‌డానికి ప్ర‌తి రోజూ రెండున్న‌ర గంట‌ల స‌మ‌యం ప‌ట్టేద‌ని, ఆ మేక‌ప్ తీయ‌డానికి గంట‌న్న‌ర స‌మ‌యం ప‌ట్టేద‌ని తెలిపారు.

చ‌ర‌ణ్ త‌న పాత్ర‌కు సంబంధించి చిన్న క్లారిటీ ఇవ్వ‌డంతో రాజ‌మౌళి అవాక్కయిన‌ట్టు తెలుస్తుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమాను చేస్తుండ‌గా, ఇందులో ఎన్టీఆర్ కూడా న‌టిస్తున్నాడు. ఆయ‌న తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అదిస్తుండ‌గా, ఇందులో హిందీ న‌టులు, ఇంగ్లీష్ న‌టీన‌టులు కూడా ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles