మంచు-మెగా బంధానికి నిదర్శనం.. సోషల్ మీడియాలో వైరల్ పిక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న ప్రేమలు, కోపాలు, ద్వేషాలు, దూరాలు, మనస్పర్థలు అన్నీ అందరికీ తెలిసినవే. ఏవి ఎలా ఉన్నాబయటకు ఎన్ని రకాల వార్తలు వచ్చినా కూడా మంచు మెగా ఫ్యామిలీలు మాత్రం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటాయి. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విష్ణు ఎంతో క్లోజ్‌గా ఉంటారు. అందులోనూ రామ్ చరణ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్ చేసే రచ్చ అయితే అంతా ఇంతా కాదు.

Ram Charan Manchu Manoj And Manchu Lakshmi Celebrates Diwali
Ram Charan Manchu Manoj And Manchu Lakshmi Celebrates Diwali

ఆ మధ్య మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో చిరంజీవి మోహన్ బాబు హత్తుకోవడం, ప్రేమకు ముద్దులు పెట్టుకోవడంతో ఈ బంధం మరింత గట్టిగా తయారైంది. మంచు మనోజ్ కొత్త సినిమా అహం బ్రహ్మాస్మి ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలకు రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా రావడంతో అప్పుడు అది హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో రామ్ చరణ్ మీద ప్రేమను మంచు మనోజ్ చెప్పిన తీరు చెప్పిన మాటలు అందర్నీ ఎమోషనల్ చేశాయి. నా సొంత బ్రదర్ అంటూ సోషల్ మీడియాలో చేసిన సుధీర్ఘమైన పోస్ట్ తెగ వైరల్ అయింది.

తాజాగా రామ్ చరణ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్ కలిసి దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మనోజ్ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. నా స్వీట్ బ్రదర్ రామ్ చరణ్, లవ్లీ అక్కతో కలిసి ఎంతో మంచి సమయాన్ని గడిపాను.. ఈ దీపావళిని నాకెంతో ఇష్టమైన వారితో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాను.. అంటూ మంచు మనోజ్ అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.