తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో చిత్రీకరణలు మొదలయ్యాయి. ఒక్కొక స్టార్ హీరో ముహూర్తం పెట్టుకుని మరీ సెట్స్ మీదకు వెళ్తున్నారు. జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి కూడ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ షూటింగ్లో పాల్గొంటారని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కంటే ముందే రామ్ చరణ్ సెట్స్ మీదకు వచ్చేశారు. ఈరోజు ఉదయమే చరణ్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇన్నాళ్లు లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంట్లోనే ఉండటంతో చరణ్ మేకోవర్ మారింది. దీంతో మళ్లీ పాత లుక్ కోసం హెయిర్ కట్ చేయించుకున్నారు.
మిగిలి ఉన్న షూటింగ్ మొత్తాన్ని ఈ షెడ్యూల్లోనే ఫినిష్ చేయాలనేది రాజమౌళి టార్గెట్. అందుకే ప్రధాన తారాగణం డేట్స్ అన్నీ లాక్ చేశారట. ఇకపై సినిమా పూర్తయ్యేవరకు ఎవ్వరికీ ఎలాంటి సెలవులు ఉండవట. ఇంకో రెండు మూడు రోజుల్లో ఎన్టీఆర్, ఆలియా భట్ సైతం షూట్లో జాయిన్ అవుతారు. ఈ షెడ్యూల్లోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ మీద 8 నిముషాల వ్యవధి ఉన్న ఒక పాటను తెరకెక్కిస్తారట. ఈ పాట కోసం భారీ లెవల్లో ఖర్చుపెడుతున్నారట. చరణ్, ఎన్టీఆర్ కలసి కనిపించబోయే పాట కనుక అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. చూస్తుంటే రాజమౌళి ఈ దఫాలో మాత్రం సినిమాను ఫినిష్ చేసేలానే ఉన్నారు.