RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యేది అప్పుడే.. సినిమా విడుదల పై చెర్రీ షాకింగ్ కామెంట్స్!

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఎంతోమంది అభిమానులు తీవ్ర నిరాశ చెందారని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ దిల్ రాజు సోదరుడు ఆశిష్ రెడ్డి హీరోగా మన ముందుకు రాబోతున్న రౌడీ బాయ్స్ చిత్ర బృందం నిర్వహించిన మ్యూజిక్ ఈవెంట్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ… చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియచేశారు.ఆశిష్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఇప్పటికే ఇండస్ట్రీలో తన తండ్రి తన బాబాయ్ నిర్మాతలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారని, నువ్వు మాత్రం హీరోగా మంచి పేరు సంపాదించాలని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాకపోవడంతో తనకు ఏమాత్రం బాధ లేదని స్పష్టం చేశారు.

అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై కూడా రామ్ చరణ్ స్పందించారు.ఈ సినిమా కోసం దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామని ఆ కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే సరైన సమయం కోసం వేచి చూడాలని తెలిపారు.అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం డైరెక్టర్ రాజమౌళి నిర్మాత డివివి దానయ్య నిర్ణయానికే వదిలేస్తామని, వీరిద్దరూ ఎప్పుడు సినిమాని విడుదల చేద్దాం అంటే అప్పుడే ఈ సినిమా విడుదల అవుతుందని ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ ఈ సినిమా గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.