Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ సినిమా ద్వారా ఈయన గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా ఘోరంగా డిజాస్టర్ గా నిలిచింది అదేవిధంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇక రాంచరణ్ తో పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఇతర హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాలను అందుకొని దూసుకొని పోతున్నారు. ఇక ఈ సినిమా అందించిన ఫలితం పట్ల అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ తన తదుపరి సినిమాల పై ఎంతో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అయితే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈయన మరోసారి సుకుమార్ డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు.
పుష్ప 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో కనిపించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాలో కూడా రామ్ చరణ్ ఒక డిజాస్టర్ తో బాధపడుతున్న పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక స్ప్లిట్ పర్శనిలిటీ డిసీజ్ తో కనిపించబోతున్నాడట. ఇదివరకే రంగస్థలం సినిమాలో చెవిటి వాడిగా నటించి సక్సెస్ అందుకున్న చరణ్ మరోసారి అదే హిట్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. మరి రామ్ చరణ్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
