తప్పటడుగులు ప్రతి ఒక్కరూ వేస్తారు, కానీ ఆ తప్పటడుగుల నుండి పాఠాలు నేర్చుకున్నవారే ఎదుగుతారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ ఫార్ములాను పాటిస్తున్నాడు. కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు రామ్ చరణ్ కూడ రాంగ్ స్టెప్స్ వేశాడు. ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరికంటే ముందువరుసలో నిలబడిన చరణ్ ఆ వెంటనే ప్రయోగం పేరుతో ‘ఆరెంజ్’ సినిమా చేసి పాతాళానికి పడ్డాడు. ఆ సినిమా పరాజయంతో ఎన్నో అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు.ఆ ఫ్లాప్ నుండి కొలుకోవడానికి ఎక్కువ సమయమే పట్టింది. అలాంటి పొరపాటే ఇంకొకటి చేశాడు. అదే ‘వినయ విధేయ రామ’.
బోయపాటి శ్రీనును చూసి ఈ సినిమా చేశాడు చరణ్. అదీ దెబ్బకొట్టింది. అభిమానులైతే ఆ సినిమా చూసి ఖంగుతిన్నారు. మళ్లీ అలాంటి సినిమా చేయవద్దని చేతులు జోడించినంత పనిచేశారు. ఈ రెండు సినిమాల నుండి చరణ్ చాలా పాఠాలే నేర్చుకున్నాడు. దర్శకుడిని, స్టోరీని చూసి టెంప్ట్ అవ్వకూడదని, అసలు కథ ఏదైనా తనకు సెట్ అవుతుందా లేదా, అయితే ఎంతవరకు తీసుకెళ్లగలుగుతుంది లాంటి విషయాలను బేరీజు వేసుకుంటున్నారు. అందుకే పెద్దగా సినిమాలకు సైన్ చెయ్యట్లేదు.
ప్రస్తుతం మీడియమ్ రేంజ్ హీరో కూడ చేతిలో మినిమమ్ రెండు మూడు సినిమాలను పెట్టుకుని ఉంటున్నాడు. కానీ చరణ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత శంకర్ సినిమా ఒక్కదానికే సైన్ చేశారు తప్ప ఇంకొకటి ఇప్పుకోలేదు. కారణం తొందరపడి వేటికీ కమిట్ అవ్వకూడదనే నియమమే. అందుకే కథలను అలా హోల్డ్ చేసి పెట్టి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటున్నారు.