Ram Charan And Shankar : రామ్ చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.!

Ram Charan And Shankar :  మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమా దగ్గరకి సాలిడ్ క్రేజ్ తో సత్తా చాటడానికి సిద్ధం అవుతున్న స్టార్ హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. లేటెస్ట్ తన భారీ సినిమా రాజమౌళితో చేసిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తో సత్తా చాటడానికి సిద్ధంగా ఉండగా ఇది లైన్ లో ఉండగానే మరో ఇండియా టాప్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో సినిమా అనౌన్స్ చేసి మరోసారి పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషన్ ని రేపాడు.

దీనితో ఇలా ఇద్దరు ఇండియాస్ టాప్ దర్శకులు అయినటువంటి శంకర్, రాజమౌళి లతో సినిమా చేసిన ఏకైక హీరోగా తాను నిలిచాడు. మరి ఇప్పుడు శంకర్ సినిమాలో నటిస్తున్న చరణ్ దానిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు (Ram Charan And Shankar). ఇటీవలే సినిమా తాలూకా మూడో షెడ్యూల్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు ముగించేశాడు. మరి ఇప్పుడు ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఇన్ని రోజులు రాజమండ్రిలో షూటింగ్ జరగగా నిన్నటితో ఈ షూటింగ్ ప్యాక్ అప్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చెయ్యగా నెక్స్ట్ షెడ్యూల్ పై సమాచారం తెలుస్తుంది. దీని ప్రకారం శంకర్ విశాఖపట్నంలో కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ చేయనున్నాడట.

అలాగే దీని తర్వాత మరో షెడ్యూల్ ని అమృతసర్ లో ప్లాన్ చేసినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. సో ఈ రెండు ప్రాంతాల్లో ఈ భారీ సినిమా షూటింగ్ ఫిక్స్ అయ్యింది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.