షూటింగ్ పూర్తిచేసుకున్న రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ ల ‘శశివదనే’

 గౌరీ నాయుడు సమర్పణలో ఎస్‌విఎస్‌ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. మరియు ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా,సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె , ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ నటీనటులుగా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం లో అహితేజ బెల్లంకొండ నిర్మాణ సారద్యంలో గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ కోనసీమలోని అందమైన లొకేషన్లలో 50 రోజుల పాటు  జరిపిన చిత్రీకరణ జరుపుకుంది.ఈ సినిమా మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ  మాట్లాడుతూ..శశివదనే’ చిత్రాన్ని కోనసీమ, అమలాపురంలోని సుందరమైన లొకేషన్లలో 50 రోజుల పాటు చిత్రీకరించాం. అద్భుతమైన అనుభవం మరియు జ్ఞాపకాలను అందించిన కోనసీమకు ధన్యవాదాలు.

ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియో క్లిప్‌లో, పెద్ద ఎత్తున పొలాలు మరియు చెట్లను సౌందర్యంగా బంధించడాన్ని మనం చూస్తాము. ‘శశివదనే’ విజువల్స్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి అద్భుతమైన వీడియో నిదర్శనం. సినిమాలో ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్‌గా ఉండబోతున్నాయి. గోదావరి ల్యాండ్‌స్కేప్ నేపథ్యంలో గ్రాండియర్ మరియు హై స్టాండర్డ్స్‌తో సన్నివేశాలు వస్తాయి. ‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్నాడు.

గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘శశివదనే’ చిత్రంలో  హీరో చాలా చక్కని నటనను కనపరచాడు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించింది.చిత్ర దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన సెలెక్ట్ చేసుకున్న గోదావరి నేపథ్యంలోని  లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని చాలా అందంగా తెరకెక్కించాడు. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటీ నటులు 

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్, రఘు కుంచె, ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు

పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: గ్యారీ బీహెచ్, కలరిస్ట్: ఎ. అరుణ్ కుమార్ (డెక్కన్ డ్రీమ్స్), సీఈవో: ఆశిష్ పెరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్ – సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన