Rajinikanth: సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సీనియర్ నటుడు రజినీకాంత్. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే త్వరలోనే రజినీకాంత్ కూలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇలా రజినీకాంత్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈయన భాష సినిమాకి సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని చోటా కె నాయుడు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. భాషా సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చోటా కె నాయుడు పని చేశారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన రజనీకాంత్ గురించి భాషా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి బయట పెట్టారు.
భాషా సినిమా షూటింగ్ లో భాగంగా సమ్మర్ లో ఒక పాట షూటింగ్ చేస్తున్నాము అయితే అప్పటికే రజనీకాంత్ షర్టు మొత్తం పూర్తిగా తడిసిపోవడంతో డాన్స్ కొరియోగ్రాఫర్ అయినా తరుణ్ భాస్కర్ గారితో మాట్లాడుతూ రజనీకాంత్ గారి షర్టు మొత్తం తడిసిపోయింది వేరే షర్ట్ మార్పించండి అని చెప్పాను ఆయన మాత్రం అదే షర్టులోనే షూటింగ్ చేయి అని చెప్పారు కానీ నాకు మనసు ఒప్పలేదు. షర్ట్ మొత్తం మాసిపోయిందని చెప్పిన తరుణ్ భాస్కర్ మాత్రం వెళ్లి నువ్వే చెప్పుకో ఆయన చేత షర్టు మార్పిస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
ఇక రజనీకాంత్ గారు చెప్తే వింటారు కదా అని అక్కడికి వెళ్తే ఆయన నేను షర్ట్ మార్చను వెళ్లి షూట్ చేసుకోపో అంటూ అందరి ముందులో గట్టిగా అరిచారు దాంతో నాకు ఎంతో అవమానంగా భావించాను అంటూ చోటా కె నాయుడుకి తెలిపారు. ఇక ఈవినింగ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత స్వయంగా రజనీకాంత్ గారు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. ఒకవైపు కమల్ హాసన్ చిరంజీవి వంటి వారు డాన్స్ లతో అదరగొడుతున్నారు. ఇక నాకు పాటల షూటింగ్ అంటేనే వణుకు పుడుతుంది ఆ టెన్షన్లో నేనుండగా వచ్చి షర్ట్ మార్చమంటే కోపం వచ్చిందని అందుకు క్షమించు అంటూ క్షమాపణలు కోరినట్టు చోటా కె నాయుడు తెలిపారు.