Rajeev kanakala: నా పెళ్ళాం చాలా మొండిది…. విడాకులపై స్పందించిన రాజీవ్… ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు!

Rajeev kanakala: ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈయన నటించిన హోమ్ టౌన్ అనే సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సుమ గురించి అలాగే తమ విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా వర్ష మాట్లాడుతూ.. సుమా కనకాలకు , మీకు మధ్య విడాకులు అంటూ వచ్చిన వార్తలపై మీ స్పందన ఏమిటి? అనగా రాజీవ్ కనకాల సమాధానం చెబుతూ మా విడాకుల గురించి వచ్చిన వార్తలు విని మేమే షాక్ అయ్యాము. ఇక మా పిల్లలు వచ్చి మమ్మల్ని ఏకంగా నిలదీశారు. అలా పిల్లలు నిలదీయడంతో ఏం సమాధానం చెప్పాలో మాకు తెలియడంలేదని రాజీవ్ వెల్లడించారు అయినా మేము ఎందుకు విడాకులు తీసుకొని విడిపోతాము అంటూ విడాకులపై క్లారిటీ ఇచ్చారు.

ఇక సుమతో గొడవ పడినప్పుడు ఎవరు ముందు మాట్లాడతారు అనే విషయం గురించి కూడా ఈమె ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు రాజీవ్ సమాధానం చెబుతూ సుమ చాల మొండిది. మేమిద్దరం గొడవ పడితే ముందు నేనే తనతో మాట్లాడాలి తప్ప తను మాత్రం నాతో మాట్లాడదు. ఇక నేను ఏదైనా చిలిపి చేష్టలు, చిలిపి పనులు చేస్తే అప్పుడు తాను కూల్ అవుతుంది అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గురించి కూడా తెలిపారు ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా వంటలు చేస్తారనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ చేసే పైనాపిల్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుందని అది నాకు చాలా ఇష్టం అని రాజీవ్ తెలిపారు. ఈ రెసిపీ కనుక యూట్యూబ్ లో పెడితే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పైనాపిల్ కర్రీ చేసుకుంటారంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.