Rajeev Kanakala: రాజీవ్ కనకాల పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన సుమా కనకాల భర్త అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ రాజీవ్ కనకాల కూడా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు తాజాగా ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుంది. రాఖీ పండుగ సందర్భంగా రాఖీ పండుగ చేసేద్దాం అంటూ ఒక స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు కమెడియన్లు వారి సొంత చెల్లెలితో హాజరై సందడి చేశారు ఎప్పటిలాగే ఆటపాటలతో అందరిని నవ్వించి మెప్పించారు. అయితే ఈ ప్రోమో చివరిలో ఒక స్కిట్ మాత్రం అందరి చేత కంటతడి పెట్టించింది.
ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ నూకరాజు వర్ష అన్నా చెల్లెలుగా నటించారు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న వర్షను నూకరాజు బాధ్యతగా పెంచి పెద్ద చేశారు అయితే ఆమెకు క్యాన్సర్ వచ్చి చనిపోయినట్టు చూపించారు అయితే ఈ స్కిట్ చూస్తున్న వారందరూ కూడా ఒకసారిగా ఎమోషనల్ అయ్యారు. అయితే అక్కడే ఉన్నటువంటి రాజీవ్ కనకాల ఈ స్కిట్ తర్వాత మాట్లాడుతూ ఎందుకయ్యా ఫుల్లుగా భోజనం పెట్టి ఇలా ఏడిపిస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇక ఇటీవల ఏఐ టెక్నాలజీ ఎంతో బాగా అభివృద్ధి చెందింది. ఏఐ టెక్నాలజీ ద్వారా చనిపోయిన వారిని కూడా తిరిగి కుటుంబ వేడుకలలో భాగం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి కూడా స్వర్గం నుంచి దిగివచ్చి తన అన్నయ్యకు రాఖీ కట్టినట్లు చూపించారు. ఇలా తన అన్నయ్యకు రాఖీ కట్టిన ఆమె ఈ వీడియోలో మాట్లాడుతూ రాఖీ శుభాకాంక్షలు అన్నయ్య మన ఇద్దరి బంధం ఈ జన్మకు ఇంతవరకే రాసి ఉందేమో అంటూ చెప్పిన మాటలు విని రాజీవ్ కనకాల ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో చూసి కూడా ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.
