Rajamouli And Mahesh babu : మహేష్ తో భారీ సినిమా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.!

Rajamouli And Mahesh babu : మన టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని సెన్సేషనల్ మరియు క్రేజియెస్ట్ కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబో కూడా ఒకటని చెప్పాలి. ఎప్పుడైతే వీరిద్దరి నుంచి సినిమా అనౌన్స్ అయ్యిందో అక్కడ నుంచే హాలీవుడ్ లెవెల్ అంచనాలు ఈ భారీ సినిమా పై మొదలై పోయాయి.
దీనితో ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాపై అనేక రూమర్స్ కూడా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అయితే వీటిలో ఈ సినిమాని రాజమౌళి ఒక క్రేజీ మల్టీ స్టారర్ గా తీస్తున్నారని వచ్చింది కూడా ఒకటి.
మరి ఈ సినిమా నిజంగానే ఓ మల్టీ స్టారరా లేక సోలో సినిమానా అనే దానిపై రాజమౌళి లేటెస్ట్ గా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ సినిమా అసలు ఎలాంటి మల్టీ స్టారర్ కాదని కేవలం మహేష్ మాత్రం ఈ సినిమాలో కనిపించే ఏకైక బిగ్ స్టార్ అని రాజమౌళి లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలియజేసారు.
దీనితో ఈ భారీ సినిమాపై వచ్చిన రూమర్స్ కి ఒక చెక్ పెట్టినట్టు అయ్యిందని చెప్పాలి. మరి ప్రస్తుతం అయితే రాజమౌళి తన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ పనుల్లో బిజీగా ఉండగా మహేష్ బాబు “సర్కారు వారి పాట” షూట్ లో బిజీగా ఉన్నారు.