Rajamaouli : రాజమౌళి ఆమెకి అన్యాయం చేశాడా.?

Rajamaouli : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బాలీవుడ్ నటి అలియాభట్ నటించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మరదలు సీత పాత్రలో అలియాభట్ నటించింది. రిలీజ్‌కి ముందు కూడా సీతగా అలియా భట్ పాత్రకు మంచి ప్రచారం జరిగింది.
ఈ మాత్రం దానికి అలియా భట్‌ని ఎందుకు తీసుకోవాలి..అంటూ రాజమౌళిని ఏకి పారేస్తున్నారట. అలియాని సరిగ్గా వాడడం చేతకాలేదు జక్కన్నకు అంటూ సెటైర్లు మీద సెటైర్లు కొడుతున్నారట.
అయితే వాడకంలో జక్కన్నకు సాటి ఎవరూ లేరు. ఎవరిని, ఎక్కడ, ఎంత వరకూ వాడాలో జక్కన్నకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కాస్టింగ్ విషయంలో భారీ తనం చాలా ఎక్కువ. చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలను బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళికి చాలా చాలా ప్రెజర్ వుంటుంది.
దాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. అదే క్రమంలో వివిధ భాషల్లో స్టార్ యాక్టర్స్ అయిన అలియా భట్ కావచ్చు, అజయ్ దేవగణ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు.. వారికిచ్చిన పాత్రల పరిధి మేర నటించాల్సి వుంటుంది. అందులో నో క్వశ్చన్. ‘ఎత్తర జెండా’ పాటలో రామ్ చరణ్, ఎన్టీయార్‌తో పాటు, అలియాకీ ఈక్వెల్ ఇంపార్టెన్స్ దక్కింది. అద్భుతంగా సద్వినయోగం చేసుకుంది అలియాభట్ ఆ ఛాన్సుని. అది చాలదా.?
అయితే, అలియాభట్‌ పాత్రకి సరైన న్యాయం జరగలేదంటూ ఓ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోందట. కానీ, ఆ కోడి కూతలను ఈజీగా కొట్టిపారేస్తున్నారు చాలా మంది. బాలీవుడ్ జనం సైతం ఈ సినిమా విషయంలో చాలా సంతృప్తిగా వున్నారు. అన్ని వైపుల నుంచీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిపోతోంది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ.