Standup Rahul : ట్విట్టర్ రివ్యూ : రాజ్ తరుణ్ “స్టాండప్ రాహుల్” రిజల్ట్ ఎలా ఉందంటే.!

Standup Rahul : టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. అయితే ఈ యంగ్ హీరోకి కూడా గత కొంత కాలం నుంచి టైం కలిసి రావట్లేదు. మరి ఇప్పుడు మళ్ళీ తన అదృష్టం పరీక్షించుకోడానికి వచ్చిన లేటెస్ట్ సినిమానే “స్టాండప్ రాహుల్”. దర్శకుడు సంతు తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించింది.
అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం ఆ మధ్య మంచి బజ్ ని తెచ్చుకున్నా ఇప్పుడు మాత్రం ఎలాంటి బజ్ లేకుండానే గట్టి పోటీల నడుమ సినిమాకి వేరే దారి లేక ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ చూసినవారు ఈ సినిమా రివ్యూస్ ని ట్విట్టర్ లో చెప్పేస్తున్నారు.
అయితే ఇవి ఆసక్తిగా వస్తున్నాయని చెప్పాలి. కొంతమంది సినిమా మొత్తం బాగుంది అంటున్నారు. లేకపోతే బాలేదు అంటున్నారు. దీనితో ఉంటే పూర్తి పాజిటివ్ టాక్ లేకపోతే నెగిటివ్ టాక్ ఈ సినిమాపై వినిపిస్తుంది.
అలాగే మరికొందరు అయితే ఈ సినిమా థియేటర్స్ లో చూసే రేంజ్ సినిమా కాదని జస్ట్ ఓటిటి కి ఇచేసినా పర్వాలేదు అంటున్నారు. అయితే ఈ సినిమాలో కామెడీ మంచి హైలైట్ కాగా సినిమా కొంచెం డల్ గా ఉందట. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే రిజల్ట్ ఇలా ఉంది.
https://twitter.com/SwayamD71945083/status/1504634340688420868?s=20&t=ygTmUIAkDZ7e5rbYkE6gPw