మహేష్ బాబుతో క్రేజీ డైరెక్టర్స్.. ఒకే సినిమా

Raj and DK planning movie with Mahesh Babu and Vijay Devarakonda
Raj and DK planning movie with Mahesh Babu and Vijay Devarakonda
 
రాజ్ అండ్ డీకే.. ఈ దర్శక ద్వయం జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించింది.  ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో అన్ని భాషల పరిశ్రమల్లోనూ వీరికి మంచి గుర్తింపు దక్కింది.  వీరి నుండి రాబోతున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ను రాజ్ అండ్ డీకే సంపూర్ణంగా వాడుకునే పనిలో ఉన్నారు.  మెల్లగా ఇతర భాషల్లోకి కూడ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగులో వర్క్ చేసిన వీరు మరోసారి లక్ పరీక్షించుకుంటున్నారు.  వీరు నిర్మించిన  ‘సినిమా బండి’ చిత్రం మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటోంది.  ఈ ఊపులోనే కొన్ని బడా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు వీరు. 
 
వాటిలో మహేష్ బాబు సినిమా కూడ ఉంది.  ఇప్పటికే మహేష్ బాబుతో కంటెంట్ చర్చలు జరిగాయని త్వరలోనే ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజ్ అండ్ డీకే.  ఒకవేళ వీరికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది తప్పకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం ఖాయం.  మహేష్ బాబు మాత్రమే కాదు ఇంకొక హీరో విజయ్ దేవరకొండతో కూడ రాజ్ అండ్ డీకే చర్చలు జరుపుతున్నారట.  అతనితో కూడ వీరి సినిమా ఓకే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  మొత్తానికి రాజ్ అండ్ డీకేలు తెలుగులో గట్టిగా పాగా వేయాలని చూస్తున్నారు.